168 పరుగుల తేడాతో లంకపై కోహ్లీ సేన ఘన విజయం..

0

కోహ్లీ సేనకు ఘన విజయం. శ్రీలంకకు మరో ఘోర పరాభవం. కొలంబో వేదికగా ఏకపక్షంగా సాగిన నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టుకు అతిపెద్ద అవమానం. సొంతగడ్డపై తొలిసారి 168 పరుగులు తేడాతో ఓడి లంక జట్టు చెత్త రికార్డు సృష్టించింది. పరుగుల పరంగా స్వదేశంలో లంకకు ఇదే అతిపెద్ద పరాజయం. టెస్టు సిరీస్‌ను 3-0తో వూడ్చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌నూ 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు అడుగు దూరంలో నిలిచింది. తన జైత్రయాత్రలో మరో చిరస్మరణీయ విజయం అందుకొంది. టాస్‌ గెలిచిన భారత్‌.. బ్యాటింగ్ ఎంచుకుంది..

కోహ్లీ 96 బంతుల్లో 17 పోర్లు.. రెండు సిక్సులతో 131 పరుగులు చేశాడు.. రోహిత్‌ శర్మ 88 బంతుల్లో 11 ఫోర్లు.. మూడు సిక్సులతో చెలరేగిపోయాడు.. ఐదు వికెట్ల నష్టానికి 375 పరుగులతో నిలిచింది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. బుమ్రా, పాండ్యా, కుల్దీప్‌ తలో రెండు వికెట్లతో చెలరేగడంతో 207 పరుగులకే కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్‌ 80 బంతుల్లో పది ఫోర్లు బాదాడు.. సిరివర్దన 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.