15 లక్షలా 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ..

0

తీవ్ర ఉత్కంఠ రేపిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. సరికొత్త రికార్డును చేరుకుంది. ఏకంగా 15 లక్షల 60 వేల రూపాయలకు ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డూను అయ్యప్పసొసైటీకి చెందిన నాగం తిరుపతిరెడ్డి దక్కించుకున్నారు. గతేడాది స్కైలాబ్ రెడ్డి 14 లక్షలా 65 వేలకు దక్కించుకున్నారు. గతేడాది కన్నా 95 వేలు అధికంగా ధర పలికింది. 1994 నుంచి వేలం పాట జరుగుతుండగా.. ఆ యేడాది కేవలం 450 రూపాయలు లడ్డూ పలికింది. లడ్డూను దక్కించుకునేందుకు యేటికాయేడు.. పోటీ దారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ సారి వేలం పాటలో ఏకంగా 21 మంది భక్తులు పోటీ పడ్డారు.

బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం ఓ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. లడ్డూను దక్కించుకోవడంతో తమకు కలిసి వస్తుందని.. ఎలాంటి కష్టనష్టాలున్నా తొలగిపోతాయని.. భక్తుల ప్రగాఢ విశ్వాసంగా కొనసాగుతోంది. అలాగే లడ్డూను దక్కించుకున్న వారు.. చాలామంది బంధువులు, ఊరి జనాలకు పంచడంతో పాటు.. తమ పంటపొలాల్లో కూడా చల్లుతారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న బాలాపూర్ లడ్డూను దక్కించుకుని తలపై మోయడం.. ఓ గౌరవంగా భావిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here