హైదరాబాద్.. పేట్‌బషీరాబాద్‌లో దారుణం..

0

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పేటబషీర్బాగ్లో నివసిస్తున్న ప్రదీప్‌ అనే యువకుడు ఓ యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఆమెను సూరారంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నగరంలోని మరో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రదీప్‌ ప్రేమను నిరాకరించడంతోనే తనపై యాసిడ్‌తో దాడి చేశాడని బాదితురాలు చెబుతోంది.. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…