హైదరాబాద్‌లో నకిలీ విత్తనాల గోదాంపై పోలీసుల దాడులు..

0

హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తొర్రూర్‌ గ్రామంలో నకిలీ విత్తనాల గోదాంపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున సృష్టి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిర్వాహకుడు జానకీరామ్‌తో పాటు.. మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విత్తనాలను ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసులు వివరించారు. ఈ మధ్యాహ్నం.. నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/fSEB-Qr7770″ frameborder=”0″ allowfullscreen></iframe>