సీఎం చంద్రబాబు కన్వాయ్‌ని అడ్డుకున్న తాగుబోతు….

0

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌కి అడ్డువచ్చిన ఓ తాగుబోతును పోలీసులు చితకబాదారు …. హైదరాబాద్‌ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి గన్నవరం వెళ్ళాల్సిన చంద్రబాబు నాయుడు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది …. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి గన్నవరానికి చంద్రబాబు విమానంలో బయలుదేరారు … చంద్రబాదు కాన్వాయ్‌ వస్తున్న విషయం తెలియని ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళాడు .. చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్ళగానే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని చితకబాదారు .. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి అలా ప్రవర్తించాడని గుర్తించారు.