సినిమా పిచ్చితో ప్రాణాలను తీసుకున్న యువతి..

0

సినిమా లో నటిచాలని పిచ్చి.. ఓ యువతి ప్రాణం తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ లో చోటు జరిగింది … కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ళ అజరా సుల్తానా కి మోడలింగ్‌తో పాటు సినిమాల్లో నటించాలని చాలా ఇష్టం. తమ సంప్రదాయాలలో ఇలాంటివి ఉండవని మందలించి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈ నెల 5 వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది… విషయం తెలుసుకున్న తండ్రి బహదూర్ పురా పోలీసుల్ని ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు … అమ్మాయి అదే ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయిని ఆశ్రయించి తనను ముంబయికి తీసుకు వెళ్ళాలని కోరింది … మిస్సింగ్ కేసు నమోదు విషయం తెలుసుకున్న యువకుడు బహదూర్ పురా పోలీసులకి అజర్‌ సుల్తానాని అప్పగించాడు … కౌన్సిలింగ్ చేసిన పోలీసులు అజర్‌ సుల్తానాని కుటుంబ సభ్యులకి అప్పగించారు … తన కలలు కల్లలయ్యాయని మనస్థాపానికి గురైన అజర్‌ సుల్తానా సినిమాలపై మోజు తగ్గించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది … కేసు నమోదు చేసిన బహదూర్ పురా పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.