సరిహద్దుల్లో నుంచి వెనక్కివెళ్లండి, లేదా చచ్చిపోతారు….భారత సైనికులకు చైనా మాజీ రాయబారి హెచ్చిరిక

0

సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా మరోసారి తన నోటి దురుసుని బయటపెట్టుకుంది …… సరిహద్దుల్లో నుంచి వెనక్కివెళ్లండి. లేదా బందీలవుతారు .. అదీ కాకపోతే చచ్చిపోతారంటూ భారతదేశాన్ని చైనా మాజీ రాయబారి హెచ్చరించారు … సిక్కిం సరిహద్దుల్లో డొక్లామ్‌ప్రాంతంలో భారత్‌చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు చైనా మీడియా, అటు ఆ దేశం అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే… ముంబైలో చైనా కౌన్సెల్‌జనలర్‌గా పనిచేసిన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా తాజాగా సెంట్రల్‌టెలివిజన్‌ఇంగ్లిష్‌చానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు…

సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరొక దేశం భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులు అవుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కొంటారు. ఒకటి స్వచ్ఛందంగా వెనుకకు తగ్గడం, లేదా పట్టుబడటం.. అప్పటికీ సరిహద్దు వివాదం సమసిపోకపోతే.. ఆ సైనికులు మృత్యువాత పడవచ్చంటూ లియు యౌఫా ప్రకటించారు … ఈ మూడు ఆప్షన్లలో భారత్‌ఏది ఎంచుకుంటుందో చైనా వేచి చూస్తున్నదని, భారత్ అర్థవంతమైన సున్నితమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.