రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిస్టరీగా మారిన ఇద్దరి ఆత్మహత్యలు..

0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేటలో బి.టెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగిన దివ్య బలవన్మరణానికి పాల్పడింది.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకుంది.. తల్లి ఇంటికి చేరుకునే లోపే దివ్య మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు దివ్య కడుపు నొప్పి భరించలేక ఆత్మ హత్య చేసుకున్నట్లుగా తల్లి పిర్యాదు చేశారు. ఐతే.. ఇదే రోజు దివ్య ప్రక్క గ్రామం గాలిపెల్లిలో ఇదే కాలేజిలో చదువుతున్న అజయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయాడు. ఒకే రోజు ప్రక్క ప్రక్క గ్రామాల్లోని, ఒకే కాలేజిలో చదువుతున్న ఇద్దరు బిటెక్ విద్యార్థులు బలవణ్మరణానికి పాల్పడడంతో ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.