పనిచేయని బోర్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్..

0

బోరు బావిలో పడి చిన్నారి మీనా మృతి చెందిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అక్రమ బోర్లపై సీరియస్ అయ్యింది. నిరుపయోగంగా ఉన్న బోర్లతో పాటు.. మూతలు లేని బోర్లను జులై 10 లోగా పూడ్చివేయాలని అధికారుల్ని అదేశించింది. ఇవాళ్టి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా గ్రామాల్లో పనిచేయని బోర్‌వెల్స్‌పై స‌మ‌గ్ర స‌ర్వే నిర్వహించాలని ఆదేశించింది.

సాగు, తాగు నీటి కోసం వేసిన బోర్లను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఎప్పుడు చిన్నారులు బోరులో పడిపోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీరు పడని బోర్లను మూసివేయకపోడంతో ప్రమాదకరంగా మారాయి. బోర్ల మూసివేతకు యజమానులతో పాటు అధికారులు చొరవ చూపడం లేదు. కామారెడ్డి జిల్లాలో నోళ్లు తెరిచి ఉన్న బోర్లపై స్టూడియో ఎన్‌ ప్రత్యేక కథనం