నేడే రాష్ర్టపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు….

0

యావత్‌ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ర్టపతి ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌ తలపడ్డ ఈ ఎన్నికల కౌంటింగ్‌ ఈ ఉదయం 11గంటలకు మొదలవుతుందని రిటర్నింగ్‌ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా తెలిపారు. తొలుత పార్లమెంట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తామని పేర్కొన్నారు. అనంతరం రాష్ర్టాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కించనున్నట్లు మిశ్రా తెలిపారు. నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్‌ కొనసాగుందని ఆయన వెల్లడించారు. సాయంత్రం 5గంటల కల్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here