డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ప్రశ్నించనున్న సిట్

0

టాలీవుడ్ నటుల విచారణ పరంపర కొనసాగుతోంది….విచారణలో భాగంగా… ఆరో రోజు అర్టు డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఐదో రోజు నటుడు నవదీప్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.. ఐతే.. విచారణలో భాగంగా బ్లడ్.. గోళ్లు.. వెంట్రుకలు ఇచ్చేందుకు నవదీప్ నిరాకరించారు..
హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది … అయిదురోజులుగా సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇంటరాగేషన్‌ చేస్తున్నారు … విచారణలో భాగంగా వారినుండి గోర్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు సేకరిస్తున్నారు … ఇలా సేకరించడం చట్ట విరుద్ధమంటూ సినీ నటి ఛార్మి హైకోర్టును ఆశ్రయించారు … బలవంతంగా రక్త నమూనాలు సేకరించడం చట్టవిరుద్ధమంటూ పేర్కొన్నారు …. న్యాయవాది సమక్షంలోనే తనను విచారించాలని చార్మి తన పిటిషన్ లో కోరారు ….