డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్న జంట నగరాలు..

0

డ్రగ్ కి హ‌బ్ గా ట్విన్ సిటీస్ నీ మార్చేస్తున్నారు డ్రగ్ రాకెట్ ముఠాలు. ఉన్నత విద్య చదివి, దేశ విదేశాల్లో మంచి సంస్థల్లో పని చేసిన వారు డ్రగ్ కు బానిసలవుతున్నారు.. అంతే కాకుండా వాటి వ్యాపారానికి సైతం మొగ్గుచూపుతున్నారు.

హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంపై.. సిట్ ఏర్పాటు చేస్తూ.. ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్.. ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్‌పై.. మరింత లోతైన విచారణ కోసం.. హైదరాబాద్‌కు చెందిన శీలం శ్రీనివాస్‌రావు, సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్‌లతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. ఎవరెవరికి విక్రయిస్తున్నారనే సమాచారం కోసం.. సిట్ విచారణ సాగనుందని తెలిపారు. డ్రగ్స్ కేసులో.. చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని.. మరో రెండు రోజుల తర్వాతే అన్ని వివరాలను వెల్లడిస్తామని.. తెలిపారు.

మరోవైపు 11 మందిని విచారించిన పోలీసులు.. ఓ సినీ నిర్మాత ఫోన్‌ నెంబర్.. డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్ దగ్గరుందని.. తెలిపారు. ఆ నిర్మాతకు గతంలో డ్రగ్స్‌ తీసుకున్న చరిత్ర కూడా ఉందని.. స్పష్టం చేశారు. మరోవైపు కార్పొరేట్‌ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ మాఫియా గాలం వేసినట్లు తమ విచారణలో వెల్లడైందని.. పోలీసులు తెలిపారు. ముఖ్యంగా 8 నుంచి 10 తరగతికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్లు తేలిందన్నారు. వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడినట్లు వివరించారు. దీనికి సంబంధించి.. హైదరాబాద్‌లో 9 ఇంజినీరింగ్ కాలేజీలు, 4 ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు నోటీసులు అందజేసినట్లు.. తెలిపారు. ఇటు పోలీసులు పట్టుకున్న నిందితులు ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా.. వారికి 14 రోజుల రిమాండ్‌ను విధించింది.

మరోవైపు డ్రగ్స్ ముఠాలో ప్రధాన నిందితుడు కెల్విన్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అయితే కెల్విన్ తండ్రి బెర్నార్డ్ మాత్రం.. తన కుమారుడు డ్రగ్స్ తీసుకుంటాడు కానీ.. అమ్మడని తెలిపాడు. మంగళూరులో బీబీఎం కోర్సు చదువుతున్నాడని.. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నాడన్నది అవాస్తవమని.. బెర్నార్డ్ తెలిపాడు.