టాటా టెక్నాలజీస్ లో వాటాల విక్రయం

0

• డీల్‌ విలువ రూ. 2320 కోట్లు

టాటా టెక్నాలజీస్ లో ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్‌ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌ 36 కోట్ల డాలర్ల (2,320 కోట్ల రూపాయలు)తో 43 శాతం వాటా సొంతం చేసుకోనుంది. సింగపూర్‌ కేంద్రంగా ఉన్న టాటా టెక్నాలజీస్‌, టాటా గ్రూప్‌లోని టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ. టాటా టెక్నాలజీస్ లోని తమ 30 శాతం వాటాలను వార్‌బర్గ్‌ పింక్‌సకు టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది. మరో 13 శాతం వాటాను టాటా క్యాపిటల్‌ నుంచి వార్‌బర్గ్‌ కొనుగోలు చేయనుంది. దాదాపు 23 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా టెక్నాలజీస్ లో 8,500 మంది ఉద్యోగులున్నారు. ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ ఐటి కంపెనీగా ఉన్న టాటా టెక్నాలజీస్‌లో ప్రస్తుత డీల్‌ తర్వాత కూడా టాటా గ్రూప్‌ సంస్థలకు 43 శాతం వాటా ఉంటుంది.