చార్మి పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన విచారణ..

0

హైదరాబాద్ డ్రగ్స్‌కేసులో విచారణ జరుగుతున్న తీరుపై సినీ నటి చార్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది …. మొదట చార్మి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు … తన క్లయింట్ కు ఇంకా పెళ్లి కాలేదని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నచార్మిపై డ్రగ్స్‌వాడకం తరహా నిందలు వేయడం సరికాదని ఆయన వాదించారు … బలవంతపు రక్త నమూనాల సేకరణ నుండి చార్మికి మినహాయింపునివ్వాలని ఆమె న్యాయవాది కోరారు …. చట్టానికకి విరుద్ధంగా జరుగుతున్న సిట్ విచారణ న్యాయబద్దంగా జరగాలని చార్మి న్యాయవాది కోర్టును అభ్యర్థించారు … దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినపిస్తూ ఛార్మి కి ఇచ్చిన నోటీసులో మీరు ఎక్కడ విచారణ జరపమంటే అక్కడే జరుపుతామని రాశామని వివరించారు … విచారణలో ప్రతి అంశాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు
NDPS యాక్ట్ ప్రకారమే డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోందని, బలవంతంగా ఎవరి దగ్గర రక్త నమూనాలు తీసుకోవడం లేదు స్వచ్చందంగా వారే ఇస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు … తప్పు చేయనప్పుడు చార్మి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు … కెల్విన్ హైద్రాబాద్‌లో చాలా మందికి డ్రగ్స్ సప్లై చేశాడని , అతని స్టేట్‌మెంట్‌ఆధారంగానే సెలబ్రిటీలకు నోటీసులిచ్చామని సిట్‌తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు .. హైదరాబాద్‌లోని పబ్బులు, రెస్టారెంట్లలో చాక్లెట్లు, కూల్ డ్రింకులు రూపాల్లో మాదకద్రవ్యాల సరఫరా జరగుతోందని సిట్‌తరపు న్యాయవాది వెల్లడించారు… హైద్రాబాద్ మరో ముంబై లా మారిందని దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే ఈ పిటిషన్‌వేశారని ఈ పిటిషన్ వేశారని సిట్‌తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు ..