కూకట్‌పల్లిలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థుల ఆగ్రహం..

0

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో.. నిజాంపేట్‌ క్రాస్‌ రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు.. అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. వరుసగా సెలవులు వచ్చినా.. హోమ్‌ సిక్‌ లీవులు కూడా ఇవ్వడం లేదంటూ.. స్టూడెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రెండు ఫ్లోర్లలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కనీసం ఔటింగ్‌కు కూడా అనుమతివ్వడం లేదంటూ.. స్టాఫ్‌ను రూమ్‌లలో బంధించి.. నానా హంగామా సృష్టించారు. గేట్లకు తాళం వేసి.. కనీసం పోలీసులను కూడా లోనికి రాకుండా.. అడ్డుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మొదలైన వీరంగం.. ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/SK_kF346CR4″ frameborder=”0″ allowfullscreen></iframe>