కార్ల కంపెనీల డిస్కౌంట్ల మేళా

0

మోడల్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్‌
జిఎస్టి అమలుకన్నా ముందే కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం

జిఎస్టి అమలుకన్నా ముందే తమ వద్ద ఉన్న సరుకును విక్రయించేందుకు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు దుస్తులు, ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తుల కంపెనీల నుంచి కార్ల కంపెనీల వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఇస్తున్నాయి. లెవీస్‌, రీబాక్‌, ఉడ్‌లాండ్‌ వంటి బ్రాండ్లు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నాయి. కార్ల కంపెనీలు కొత్త ఆఫర్లతో ఊరిస్తున్నాయి.