ఈ నెల 30న వైద్య బృందంతో ఉద్ధానంకు పవన్ కళ్యాణ్

0

కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వందలాదిమందిని పరామర్శించేందుకు ఈ నెల 30న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు వెళ్ళనున్నారు .. హార్వర్డ్‌నుండి వచ్చిన వైద్య బృందంతో కలిసి బాధితులతో పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు … ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబును హార్వర్డ్‌ డాక్టర్లు , పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు … ఉద్దానం కిడ్నీ సమస్యల మూలాలను కనుక్కోవాలని హార్వర్డ్‌ వైద్యులు కృత నిశ్చయంతో ఉన్నారు … ఉద్దానం ప్రాంతంలో ప్రపంచ స్థాయి కిడ్నీ సెంటర్‌ను నెలకొల్పి పరిశోధన సాగించాలని హార్వర్డ్‌ వైద్యులు ఇప్పటికే నిర్ణయించారు