ఇవాళ ముద్రగడ ఛలో అమరావతి పాదయాత్ర..

0

మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటివద్ద భారీగా సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటుచేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేయనున్నారు. అయితే… పాదయాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులక్రితమే కిర్లంపూడిని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులకు ముఖ్యమంగా ముద్రగడ ఇంటికి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి